నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 09:33

వాట్సప్ లో యానిమేటెడ్ ఎమోజీలు

•త్వరలోనే అందుబాటులోకి..

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సప్' త్వరలోనే కొత్త ఫీచర్ను ప్రవే శపెట్టనుంది. టెలిగ్రామ్ యాప్ తరహాలో తమ వినియోగదారుల కోసం సొంతంగా యానిమే టెడ్ ఎమెజీలను అందుబాటులోకి తీసుకురా నుంది.

లొట్టీ లైబ్రరీ సాయంతో వాటిని రూపొం దిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఆండ్రా యిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్లు అందిస్తున్న ఎమోజీలనే వాట్సప్ యాప్లో వినియోగదారులు ఉపయోగిస్తున్న సంగతి గమనార్హం.

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 20:31

SpaceX: స్టార్‌షిప్‌ ప్రయోగం విఫలం.. గాల్లోనే పేలిపోయిన అతిపెద్ద రాకెట్‌..!

వాషింగ్టన్‌: ఎలాన్‌మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌ చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ 'స్టార్‌షిప్‌ (Starship)' ప్రయోగం విఫలమైంది..

అమెరికా (America) దక్షిణ టెక్సాస్‌లోని బోకా చీకా తీరం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ భారీ రాకెట్‌.. కొద్దిసేపటికే పేలిపోయింది.

ఈ వ్యోమనౌక రెండు సెక్షన్లు (బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌).. నిర్ణీత సమయం (3 నిమిషాలు)లోగా విడిపోవాలి.

కానీ, విఫలం కావడంతో పేలిపోయినట్లు 'స్పేస్‌ఎక్స్‌' సంస్థ పేర్కొంది. ఈ ప్రయోగ ఫలితాలను తమ శాస్త్రవేత్తలు సమీక్షిస్తారని వెల్లడించింది..

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 13:43

Nara Lokesh: బెంజ్‌ మంత్రి కారుచౌకగా భూములు కొట్టేశారు: డాక్యుమెంట్లు బయటపెట్టిన లోకేశ్‌

ఆలూరు: మంత్రి గుమ్మనూరు జయరామ్‌ 180 ఎకరాల ఇట్టినా కంపెనీ భూములను కాజేశారంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలు ఆధారాలను విడుదల చేశారు..

దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన బయటపెట్టారు. కమర్షియల్‌ ల్యాండ్‌గా ఉన్న భూమిని వ్యవసాయ భూములుగా చూపిన మంత్రి.. తన కుటుంబం పేర రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు..

రూ.45 కోట్ల విలువైన భూమిని రూ.2కోట్ల ప్రభుత్వ విలువ చూపించి కారుచౌకగా కొట్టేసిన ఘనుడు బెంజ్‌ మంత్రి అంటూ లోకేశ్‌ దుయ్యబట్టారు.

వ్యవసాయంలో లాభం వచ్చిందన్న మంత్రి.. ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం ఎందుకు తీసుకున్నారని ఆయన నిలదీశారు. రైతులు ముందుకొస్తే ఇట్టినా భూములను రాసిస్తానన్న మంత్రి.. రిజిస్ట్రేషన్‌ తేదీ ప్రకటించాలని లోకేశ్‌ సవాల్‌ విసిరారు. ఆ భూములను తామే కొని రైతులకు పంచుతామని చెప్పారు..

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 13:42

Viveka Murder Case: రెండో రోజు మొదలైన సీబీఐ విచారణ.. ఆ ముగ్గుర్నీ వేర్వేరుగా..

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని సీబీఐ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు..

చంచల్‌గూడ జైలు నుంచి వారిద్దరినీ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని సీబీఐ కోర్టు ఇది వరకే ఆదేశించింది. వారిద్దరినీ వేర్వేరుగా విచారిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఇదే కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి రెండో రోజు విచారణకు హాజరయ్యారు. ఎంపీ నుంచి ఏయే విషయాలు రాబట్టాలన్న దానిపై సీబీఐ అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని రూపొందించుకున్నారు.

బుధవారం కొన్ని ప్రశ్నలు అడగ్గా.. ఇవాళ వాటికి కొనసాగింపుగా ఇవాళ మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశముంది..

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 13:41

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి చుక్కెదురు.. తీర్పు నిలుపుదల పిటిషన్‌ తిరస్కరణ

సూరత్‌: పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపేయాలంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్‌లోని సూరత్‌ సెషన్స్‌ కోర్టు గురువారం తిరస్కరించింది..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు.. రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

ట్రయల్‌ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని, ఇది రెండేళ్లు జైలుశిక్ష విధించాల్సినంత కేసు కాదంటూ సెషన్స్‌ కోర్టును రాహుల్‌ ఆశ్రయించారు.

శిక్షను నిలిపివేయకపోతే తన ప్రతిష్ఠకు పూడ్చలేని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. రాహుల్‌ పిటిషన్‌పై గత గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్‌పీ మొగేరా తీర్పును నేడు వెలువరించారు..

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 07:39

TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ రద్దు

ఈసారి నుంచి శాశ్వతంగా తొలగింపు

ఎంసెట్‌ మార్కులతోనే ర్యాంకు

జీఓ జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌లో ఈసారి నుంచి ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టులకు ...అంటే 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్‌ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్‌లో స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

జేఈఈ మెయిన్‌, నీట్‌లలోనూ ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు. ఎంసెట్‌కు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతారు. ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయకపోవడం, ఎంసెట్‌ అధికారులకు అందజేయకపోవడం వల్ల ఎంసెట్‌ ఫలితాలకు ఆటంకం ఏర్పడుతోంది.

ఇలాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతిపాదన మేరకు ఇంటర్‌ వెయిటేజీని రద్దు చేసింది. కరోనా కారణంగా 2020, 2021, 2022లలో కూడా ఇంటర్‌ వెయిటేజీని తొలగించారు. ఈసారి దానిని శాశ్వతంగా రద్దు చేస్తూ... గతంలోని జీఓను సవరిస్తూ తాజాగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీఓ 18ను జారీ చేశారు.

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 07:37

దళారుల చేతిలో ధరలు

- మొక్క జొన్న ధరలు పతనం

మార్కెట్‌లో రూ. 2200 నుంచి రూ.1800లకు తగ్గుదల

- వ్యాపారులు సిండికేట్‌గా మారిన వైనం

- కానరాని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు

పంట ఏదైనా రైతుల చెంతకు రాగానే ధరలు పతనం కావడం పరిపాటిగా మారింది. మొన్నటి వరకు పత్తి, మిర్చిలో సిండికేట్‌గా మారిన వ్యాపారులు.. ఇప్పుడు మొక్కల కొనుగోలులో రైతులను నిండా ముంచుతున్నారు. వారం రోజుల కిందట మొక్కజొన్న క్వింటాకు రూ.2200 ధర ఉండగా ఇప్పుడు రూ.1800లకు చేరింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెరగకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మొక్కజొన్న కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్ల మార్కెట్‌లో వ్యాపారులదే ఇష్టారాజ్యం అయింది. ధరలు పెరగకుండా వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి కొనుగోళ్లను నిలిపేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదనే ప్రచారం చేస్తున్నారు. దాంతో చేసేది లేక రైతులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. గతేడాది మొక్కజొన్న క్వింటాకు రూ. 2500కు కొనుగోలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ మధ్ధతు ధర క్వింటాకు రూ.1960 ఖరారు చేసింది.

అయితే ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దాంతో రూ.1800కే వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయకపోవడంతో మధ్య దళారుల చేతిలో రైతులు నష్ట్టపోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు పైగానే మొక్కజొన్న సాగు చేశారు. ఈసారి యాసంగిలో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగుపై దృష్టి సారించారు. తాడూరు మండల పరిధిలోనే సుమారు 18,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. తెల్కపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో 150 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఖరీఫ్‌లో పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో ఈసారి పంటను అధికంగా సాగు చేశారు.

కౌలు రైతుల పరిస్థితి దయనీయం

మొక్క జొన్న సాగులో కౌలు రైతులే కీలకంగా ఉన్నారు. ఒక్కో ఎకరాకు రూ.పది వేలు చెల్లించి లీజుకు తీసుకున్నారు. ఎకరా పెట్టుబడి రూ.25 వేలకు దాటింది. లీజుతో కలుపుకొని మొత్తం రూ. 35వేలు అయ్యింది. 25 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న దిగుబడి 25 శాతం తగ్గడంతో కౌలు రైతులు లబోదిబోమంటున్నారు. కాగా, పంట పూర్తిగా చేతికి వచ్చి కల్లాల్లో ఉన్నా నేటికీకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పెట్టుబడి అయినా..రావడం లేదు

నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాను. కౌలుతో కలుపుకొని సుమారు రూ.1.60లక్షలు పెట్టుబడి అయింది. గతేడాది రూ.2500 అమ్మగా, ఈసారి రూ.1800కు పడిపోయింది. పెట్టుబడి అయినా వచ్చే పరిస్థితి లేదు.

- బాలస్వామి, తాళ్లపల్లి, తెలకపల్లి మండలం, నాగర్‌కర్నూల్‌

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

పత్తి వేసి ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులు రబీలో మొక్కజొన్న సాగు చేశారు. ఈసారి ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా ఉంది. గతేడాది రూ. 2500లు ఉన్నది. ఈసారి 1800లకు పడిపోయింది. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం స్పందించి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి.

- శ్రీనివాసులు, రైతు సంఘం

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 07:34

నేడు సూర్యగ్రహణం.. నాలుగు రాశుల వారు ఈ విషయాల్లో జాగ్రత్త

నేడు సూర్యగ్రహణం. ఈ ఏడాది ఏప్రిల్ 20 గురువారం అమావాస్య రోజున సూర్యగ్రహణ ఏర్పడనుంది. ఉదయం 7.05 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటలకు ముగుస్తుంది.

అంటే దాదాపు 5 గంటల 25 నిమిషాల పాటు ఉంటుంది. అయితే ఇది భారత్‌లో కనిపించదు.

ఇక ఈ సూర్యగ్రహణం రోజు కొన్నిగ్రహాల కలయిక జరుగుతుంది. అందువలన నాలుగు రాశులవారు జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, ఈ సూర్యగ్రహణం ఏ రాశులపైన ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి :

మేష రాశివారు సూర్యగ్రహణం రోజు శుభకార్యాలు చేయడం, కొత్త పనులు ప్రారంభించడం, కొత్త వస్తువులు కొనడం అస్సలే మంచిది కాదంట. గ్రహణం ప్రభావంతో ఈ రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది.

వృశ్చిక రాశి :

ఈ రాశి వారిపై సూర్యగ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. దీని వలన వీరు ఆర్థిక సమస్యలు, ఖర్చులు అధికం కానున్నాయంట. అంతే కాకుండా చిన్న చిన్న గొడవలు జరుగుతాయంట. అందువలన ప్రతీ విషయంలో ఆచీ తూచీ అడుగు వేయాలంటున్నారు పండితులు. ఇక వీరు శివనామస్మరణ చేయడం చాలా మంచిదంట.

కన్యరాశి:

ఈ రాశి వారు సూర్యగ్రహణం రోజు కొత్త పనులు ప్రారంభించకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా నడపాలి. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

మకర రాశి :

ఈరాశి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఆర్ధిక సమస్యలు, ఖర్చులు అధికం కానున్నాయి. చేయాలనుకున్న పనులు అలాగే నిలిచిపోతాయి. ఇక గ్రహణం ఉన్నందున కొత్త పనులేవీ ప్రారంభించకూడదు.

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 07:31

నేటితో పూర్తికానున్న ఇంటర్‌ వాల్యుయేషన్‌

గత పది రోజుల క్రితం ప్రారంభమైన ఇంటర్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియ నేటితో పూర్తికానుంది. ఇంటర్‌ పరీక్షలు మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్‌ 3 వరకు జరిగాయి.

పది పరీక్షలు ఏప్రిల్‌ ఆరున ప్రారంభమై నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఇంటర్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ పదవ తేదీ నుంచి ప్రారంభమైంది. తిరుత్తణిలోని గెంగుస్వామి నాయుడు మెట్రిక్‌ పాఠశాల, తిరువళ్లూరులోని డీఆర్‌బీసీసీ, ఆవడిలోని ఎయిడెడ్‌ పాఠశాల మూడు కేంద్రాల్లో జరిగింది. మొత్తం ఆరు వందల మంది ఉపాద్యాయులు వాల్యుయేషన్‌లో పాల్గొన్నారు.

ఇంటర్‌ వాల్యుయేషన్‌ నేటితో ముగియనుండడంతో శుక్రవారం నుంచి విద్యార్థుల మార్కులను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.

ఇలావుండగా పది పరీక్షలు నేటితో ముగియనున్న నేపథ్యంలో 24 నుంచి వాల్యుయేషన్‌ ప్రారంభం కానుంది. ఇందుకోసం తిరుత్తణి, తిరువళ్లూరు, ఆవడిలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాల్యుయేషన్‌ ప్రక్రియ 15 రోజుల పాటు సాగే అవకాశం వుంది.

నిజంనిప్పులాంటిది

Apr 19 2023, 19:14

Andhra News: ఏపీ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణకు మరోసారి నోటీసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది..

సూర్యనారాయణ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.

గతంలో వాణిజ్య పన్నుల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అదనపు కమిషనర్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కార్యాలయం వెలుపల ఉన్నతాధికారిని దిగ్భందించి ఆందోళన చేయడంపై సంజాయిషీ ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం మరోమారు నోటీసులు జారీ చేస్తూ.. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది..